నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రైవేటు, కార్పొరేటు వ్యక్తులు ఒత్తిడి తెచ్చినా…బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో పనులు చేపట్టామని వెల్లడించారు. పవర్ ప్లాంట్ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను అభినందించారు. సుమారు 10 వేల మంది సిబ్బంది ఉన్నందునా.. వారికి టౌన్ షిప్ నిర్మించాలని ఆదేశించారు.