ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడలు ఫుట్‌బాల్, క్రికెట్. కొన్ని దేశాలు ఈ రెండు క్రీడల్లో విశేషంగా రాణిస్తుంటాయి. ఇటీవల క్రికెట్ ప్రపంచకప్ ముగిసింది. ప్రస్తుతం ఫుట్‌బాల్ సమరం నడుస్తోంది. ఈ రెండు క్రీడల్లో మూడు జట్లు ప్రాతినిథ్యం వహించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాయి. అవే నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు. టీ20 కప్పు గెలిచిన ఇంగ్లాండ్, ఫిఫాలో గ్రూప్ బిలో టాప్ ప్లేసులో కొనసాగుతోంది. సౌతాఫ్రికా, జింబాబ్వేలకు షాకిచ్చి.. 2024 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించిన నెదర్లాండ్స్.. ఫుట్‌బాల్‌లోనూ గ్రూప్ ఎలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు అటు క్రికెట్, ఇటు ఫుట్‌బాల్‌లో నిరాశపరిచింది.