జేఈఈ మెయిన్స్ అర్హతల్లో స్వల్ప మార్పులు చేసినట్లు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్స్ ఏజెన్సీ) తెలిపింది. జేఈఈ అభ్యర్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్ర సంస్థల్లో ఎంట్రెన్స్ పొందటానికి ఇంటర్మీడియట్లో 75 శాతం మార్కులు ఉండాలని ఇదివరకు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఈశాన్య రాష్ట్రాల్లో వివాదం రాజేసింది. ఈ వివాదంతో ఎన్టీఏ దిగొచ్చింది. ఎస్సీ, ఎస్టీలు ఇంటర్, ప్లస్టులో 65 శాతం మార్కులు పొంది ఉంటే అర్హత సాధిస్తారని పేర్కొంది.