నేడు నయనతార-విఘ్నేశ్‌ల పెళ్లి మహాబలిపురుంలోని షెరటాన్ గ్రాండ్లో జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్, షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, డైరెక్టర్ మణితర్నంతో పాటు మరికొందరు ప్రముఖ సినీ సెలబ్రిటీలు పెళ్లికి హాజరయ్యారు. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, డైరెక్టర్ శివ, కేఎస్ రవికుమార్, అట్లీ, రాధికాశరత్‌కుమార్ వంటివాళ్లు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు, పోలీసు సిబ్బందితో పాటు 80 మంది బౌన్సర్లను పెట్టారు. పెళ్లి సంద్భంగా తమిళనాడులో 18000 మంది పిల్లలకు భోజనం పెట్టాలని నయనతార-విఘ్నేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.