TRS అంటే తోడు దొంగల రాష్ట్ర సమితి అని, BRS అంటే భారత బడా చోర్ రాష్ట్ర సమితి అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎల్ పాల్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం అని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లకు పైగా అవినీతి, యాదాద్రిలో రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ జైస్వాల్ కు ఈ అవినీతికి సంబంధించిన వివరాలు అందజేశానని పాల్ తెలిపారు. కేసీఆర్ త్వరలోనే జైలుకెళ్తారన్నారు. తన కొడుకును సీఎం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు.