విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా దూకుడు తత్వంతో ఉండే విరాట్ కోహ్లీ జీవితంలో అనుష్క స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. అందుకే కోహ్లీ తాను చేసిన సెంచరీల్లో కొన్నింటిని భార్యకు అంకితం ఇస్తుంటాడు. ముఖ్యంగా ఫామ్‌లేమితో బాధపడుతున్న సమయంలో చేసిన సెంచరీలను అంకితం చేయడం వీరి మధ్య బంధాన్ని తెలియజేస్తుంది. ఆసీస్‌తో నాలుగో టెస్టులో చేసిన సెంచరీ(186), 2022లో ఆసియా కప్‌లో అఫ్గాన్‌పై ఆడిన సెంచరీ ఇన్నింగ్స్(122*), 2018లో ఇంగ్లాండ్‌పై సెంచరీ(149) అనంతరం మెడలోని లాకెట్‌ని తీసి ముద్దు పెట్టుకున్నాడు. ఈ సెంచరీలు కోహ్లీకి ప్రత్యేకం.