టాటా ఐపీఎల్ 2022లో భారత ఆటగాళ్లు దినేష్ కార్తీక్, రాహుల్ తేవాటియా, హార్దిక్ పాండ్యాలు అదరగొడుతున్నారు. ఈ ప్లేయర్స్‌కు టీమిండియా జట్టులో అవకాశం ఇవ్వాలని టీమిండియా సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ MSK ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచ కప్ ముందు జరిగే అయిదు టీ20 సిరీస్‌కు వీళ్ళను ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచ కప్‌కు చాలా సమయం ఉండడంతో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇచ్చి పరీక్షించాలని సూచించారు.