దిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌పై పంజాబ్‌కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ సంచలన ఆరోపణలు చేశారు. తాను వీసా కోసం వెళ్తే అక్కడి అధికారులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. 2021లో పాకిస్థాన్‌లోని ఓ కళాశాలలో లెక్చర్ ఇచ్చేందుకు వీసా కోసం ప్రయత్నించారు. అప్పడు హైకమిషన్ అధికారులు లైంగిక కోరిక తీర్చమని తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేయాలని అడిగారన్నారు. పాక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. దీనిపై కేంద్రమంత్రి జైశంకర్‌కు ఆమె లేఖ రాశారు.