కెరీర్ ఆరంభంలో డస్కీ, నల్లపిల్లి అంటూ హేళన చేసేవారు అని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తెలిపింది. మూడేళ్ల తర్వాత ఇటీవలే ఇండియాకు వచ్చిన ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ కెరీర్ స్టార్టింగ్‌లో నా అందంపై కామెంట్లు చేసేవాళ్లు. డస్కీ, నల్లపిల్లి అంటూ వెక్కిరించేవాళ్లు. మొదట్లో డస్కీ అంటే అర్ధం తెలీదు. తెలిసిన తర్వాత ఎంతో బాధపడ్డా. షూటింగ్స్‌లో నన్ను ఎక్కువగా వెయిట్ చేయించేవారు.’’ అంటూ అప్పటి అనుభవాలను ప్రియాంక చెప్పుకొచ్చింది.