చాక్లెట్లు ఎత్తుకెళ్లిన దొంగలు!

© Envato

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చాక్లెట్ల దొంగతనం జరిగింది. ఓ గోడౌన్‌ నుంచి రూ.17 లక్షల విలువైన చాక్లెట్లను దొంగలు ఎత్తుకెళ్లారు.బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధు అనే వ్యక్తి ఓ ఇంటిని గోడౌన్‌గా వినియోగిస్తున్నాడు. తెల్లవారుజామున ఇంటిపక్క వ్యక్తి ఫోన్‌ చేసి ఇంటి తాళం పగులగొట్టి ఉందని సమాచారమిచ్చాడు. దీంతో వెళ్లి చూసేసరికి సరుకంత మాయమైంది. సీసీ కెమెరాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. వేరే సీసీ కెమెరా దృశ్యాల సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version