సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు హైదరాబాద్‌లో తొలి కేసు నమోదైంది. మహేంద్రహిల్స్ కు చెందిన ఓ వ్యక్తి దుబాయ్ నుంచి బెంగుళూరుకు రాగా.. అక్కడ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్ రావడానికి రెండు రోజుల టైం పట్టనుండడంతో బస్సులో హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ క్రమంలో రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది. దీంతో మార్చి 2వ తేదీన బెంగళూరు అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని తెలియజేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చేందుకు అంబులెన్సులలో బయలుదేరగా.. అప్పటికే రిపోర్టు మెస్సేజ్ రావడంతో స్వయంగా అతనే తెల్లవారుజామున ఆస్పత్రికి వచ్చి వైద్యులను కలిశాడు. అయితే కొవిడ్ తొలికేసు నమోదైన రోజును పురస్కరించుకుని బుధవారం గాంధీలో సమ్మేళనం నిర్వహించారు. ఇందులో తొలి కేసు నమోదైనప్పుడు ఆసుపత్రిలో ఉన్నవారంతా భయపడిన తీరును గుర్తు చేసుకున్నారు.