Mozilla Firefoxని ఉపయోగించే వినియోగదారులకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మొజిల్లా ఉత్పత్తుల్లో అనేక భద్రతా లోపాలను కనుగొన్నట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తెలిపింది. తాజా ఫైర్ఫాక్స్ 98 అప్డేట్కు ముందు ఉన్న అన్ని మొజిల్లా ఫైర్ఫాక్స్ వెర్షన్లు ఈ భద్రతా లోపాలతో ప్రభావితమైనట్లు భద్రతా ఏజెన్సీ వెల్లడించింది. 91.7కి ముందు మొజిల్లా ఫైర్ఫాక్స్ ESR వెర్షన్లు, 91.7కి ముందున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ థండర్బర్డ్ వెర్షన్లు కూడా ఇలాంటి భద్రతా లోపాలను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.