జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR ఇచ్చిన విజయాన్ని ఆశ్వాదిస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ హుంగామ అనే ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్.. ఎన్టీఆర్ మీరు క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశిస్తారా అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ‘నేను నటుడిగా ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నా, భవిష్యత్తు ఎప్పుడో లేదు ఈ క్షణం తరువాత వచ్చే క్షణమే భవిషత్తు, ప్రస్తుతం నేను నటుడిగా ఆనందాన్ని పొందుతున్నాను’ అని మాట దాటేశాడు. మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తాడా రాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి.