తెలుగు రాష్ట్రాల్లో మూడో తరగతి విద్యార్థులు కూడా తెలుగును తప్పులు లేకుండా చదవలేకపోతున్నారు. 52 శాతం మంది పరిస్థితి ఇలాగే ఉంది. వీరిలో 19 శాతం మంది కనీసం ఒక్క పదమూ సరిగా పలకలేకవడం ఆందోళనకరం. ఏపీలో 47శాతం, తెలంగాణలో 49 శాతం మంది విద్యార్థులు లెక్కల్లో కనీస ప్రమాణాలు అందుకోలేకపోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఫౌండేషన్,లిటరసీ, న్యూమరసీ(FLN) పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 183 పాఠశాలల్లోని 1,583 మంది విద్యార్థులను పరిశీలించి ఈ నివేదిక ఇచ్చారు.