ప్రముఖ సింగర్ కృష్ణకాంత్ కుమార్ కున్నాత్(KK) 53 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందడ సినీ పరిశ్రమను విషాధంలోకి నెట్టింది. నిన్న కోలకతాలోని వివేకానంద కాలేజీకి చెందిన నజ్రుల్ మంచ్ ఆడిటోరియంలో పాటలు పాడుతూ ఉత్సాహంగా కనిపించాడు. ఆ కాసేపటికే హోటల్ రూమ్‌కి చేరుకున్న కేకే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు చివరిగా తన సొంత ఆల్బమ్ పాల్ టైటిల్ సాంగ్‌ను ఆలపించాడు. అదే కేకే పాడిన చివరి సాంగ్‌గా మిగిలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.
https://youtube.com/watch?v=vSLg1phGJHY