నేషనల్ క్రష్ రష్మిక మందన్న కుడిచేతిపై ‘ఇర్రిప్లిసియేబుల్’(Irrepleciable) అనే టాటూ ఉంటుంది. అయితే, దీనిపై ఎప్పటినుంచో వివిధ చర్చలు నడుస్తున్న నేపథ్యంలో తాజాగా రష్మిక క్లారిటీ ఇచ్చింది. ‘మా కాలేజీలో ఒక అబ్బాయి ఆడవాళ్లు చాలా సున్నితులు, ఇంజక్షన్ నొప్పిని కూడా భరించలేరు అని అన్నాడు. అది తప్పు అని నిరూపించడానికి టాటూ వేసుకోవాలని ఫిక్స్ అయ్యా. కానీ, ఏం వేసుకోవాలని క్లారిటీ లేదు. బాగా ఆలోచిస్తే Irrepleciable అనే పదం గుర్తొచ్చింది. ప్రతి ఒక్కరు మరొకరి స్థానాన్ని భర్తీ చేయలేరనేది నా ఫీలింగ్’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. దీంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది.
-
Courtesy Twitter:ShreyasMedia -
Courtesy Twitter: