వెండితెర సంచలనం అవతార్ సినిమా వచ్చి 13 ఏళ్లు గడిచింది. ప్రస్తుతం డిసెంబర్ 16న రాబోతున్న అవతార్-2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నిడివి 3గంటల 12 నిమిషాలు. మన దేశంలో ఓకే గానీ చాలా దేశాల్లో సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఉండదు. మరి అలాంటి ప్రాంతాల్లో ప్రేక్షకుడు ఏ సీన్‌కు బయటికి వెళ్లొచ్చు అని ఓ రిపోర్టర్ కేమరూన్‌ను అడగ్గా.. ‘ఏ సీన్‌కైనా వెళ్లొచ్చు మళ్లీ థియేటర్‌కు వచ్చినపుడు ఆ సీన్ చూడొచ్చు’ అంటూ తెలివిగా సమాధానమిచ్చారు.