వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపడతామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాము మేకిన్ ఇండియా అంటే.. కేసీఆర్ జోకిన్ ఇండియా అంటూ ఎద్దేవా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదైనా మంచి జరిగితే బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంటోందని..చెడు జరిగితే బీజేపీ ఖాతాలో వేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ద్వారా మార్పు సాధ్యమని నమ్మిన ప్రజలు బీజేపీ ఎమ్మెల్సీని ఎన్నుకున్నారని తెలిపారు. ఈ సారి తెలంగాణలో అధికారం సాధిస్తామన్నారు.