• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ సారి స్విగ్గీ వంతు; 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన

    ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ వేదిక స్విగ్గీ కూడా లేఆఫ్స్ బాట పట్టింది. తాజాగా 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు లే ఆఫ్స్ గురించి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. ‘‘ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. సంస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా తొలగింపు చేపట్టాం. ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం.’’ అంటూ స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటి ట్వీట్ చేశారు. కాగా స్విగ్గీ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. 2021లో రూ.1,617 కోట్లుగా ఉన్న నష్టాలు.. 2022లో రూ.3,628 కోట్లకు చేరాయి.