ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు ఒంటరిగానే పోటీచేసి అధికారం దక్కించుకున్న టీఆర్ఎస్.. ఈసారి పొత్తులతో ముందుకెళ్లాలని భావిస్తోంది. వామపక్షాలతో కలిసి పోటీచేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ పట్ల పలు వర్గాల్లో అసంతృప్తి ఉందని భావిస్తున్న కేసీఆర్.. సీపీఐ, సీపీఎంతో కలిసి బరిలోకి దిగుతారని సమాచారం. సీపీఎం, సీపీఐలకు చెరో రెండు సీట్లు కేటాయిస్తారని సమాచారం. త్వరలోనే వామపక్ష నాయకులతో కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది.