గణేశ్ ఉత్సవాలు అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి రూపం. ఏటా రికార్డు స్థాయి ఎత్తులో ఉంటూ పూజలందుకునే గణనాథుడి ఎత్తు ఈ సారి 50 అడుగులకు తగ్గిపోయింది. పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) తో తయారు చేసిన విగ్రహాల మీద ఆంక్షలు ఉండడంతో ఈ సారి ఖైరతాబాద్ లో మట్టి గణపతిని 50 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నారు. పంచముఖ లక్ష్మీవినాయక అవతారంలో గణేశుడు దర్శనమివ్వనున్నాడు.