రాష్ట్రంలో ఈ ఏడాది నుంచే ఇంటింటికిీ ఇంటర్నెట్ అందిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. “ టీ ఫైబర్ ఈ ఏడాది కార్యరూపం దాల్చుతుంది. తద్వారా దాదాపు 10 లక్షల ఇళ్లకు సౌకర్యం లభిస్తుంది. గ్రామాలకు, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలో ఐటీ పురోగమిస్తుంది. ఉద్యోగుల సంఖ్య, కంపెనీ కార్యాలయాల స్పేస్ సహా ఎన్నో విషయాల్లో బెంగళూరుని దాటేశాము. సుస్థిర ప్రభుత్వం ఉండటమే ప్రధాన కారణం ” అన్నారు.