ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌పై టీమిండియా ప్లేయర్ అశ్విన్ మరోసారి స్పందించాడు. 2011 నుంచి ఆతిథ్యం ఇచ్చిన జట్టు ట్రోఫీని నిలబెట్టుకుందని చెప్పాడు. ‘2011లో భారత్ ట్రోఫీ గెలిచింది. 2015లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో హోస్ట్‌గా నిలిచిన ఇంగ్లాండ్ టైటిల్ నిలబెట్టుకుంది. ఇప్పుడు భారత్‌లో జరగనున్న దృష్ట్యా టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. అయినా ఇదేమీ రాకెట్ సైన్స్ కాదు. సొంతగడ్డపై అన్ని వేదికల్లో భారత్ రాణిస్తోంది’ అని అశ్విన్ చెప్పాడు. గతంలో వరల్డ్‌కప్ మ్యాచుల సమయాన్ని ముందుకు జరపాలని అశ్విన్ కోరడం గమనార్హం.