అగ్నిపథ్ పథకానికి వ్యతిరేఖంగా ఆందోళనకారులు చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు చేసిన దాడిలో పలు రైళ్లు ధ్వంసమయ్యాయి. దీనిపై ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు కూడా చేశారు. కానీ ప్రస్తుతం పోలీసులకు ఓ అనుమానం వస్తున్నట్లు తెలుస్తోంది. ఆందోళనకారులకు స్టేషన్ లో ఏది ఎక్కడ ఉందో స్పష్టంగా ఎలా తెల్సిందనేది వారికి అంతు చిక్కడం లేదట. ఎవరైనా ప్రస్తుతం పని చేస్తున్న వారు కానీ మాజీ ఉద్యోగులు కానీ ఆందోళనకారులకు సాయం చేసి ఉంటారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. రైళ్లల్లో నీటిని ఫిల్ చేసే పైపులకు సంబంధించిన మోటార్లు ఎక్కడ ఉంటాయో ఇప్పటి వరకు చాలా మంది స్టేషన్ సిబ్బందికే తెలియదట. కానీ ఆందోళనకారులు మాత్రం తెలుసుకున్నారు. సికింద్రాబాద్ విధ్వంసం ఘటన మీద కేంద్రం వివరణ కోరింది.