AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పే మాటలు నమ్మవద్దని ప్రజలకు జగన్ సూచించారు. చంద్రబాబుకి 2024లో జరిగే ఎన్నికలే చివరివని సీఎం హితవు పలికారు. ‘మనమంతా దుష్టశక్తులపై పోరాడాలి. బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. వైకాపా హయాంలో బీసీలదే రాజ్యాధికారం. 45ఏళ్ల అనుభవమున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక పోతున్నాడు. నిజాయితీకి, వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. చంద్రబాబు ఇచ్చే ఎన్నికల హామీలను నమ్మొద్దు. ప్రతి గడపకు వాస్తవమేంటో వెళ్లాలి. అసత్య ప్రచారాన్ని నమొద్దని చెప్పండి. మంచి జరిగితేనే జగనన్నకు అండగా ఉండండని కోరండి’ అని బీసీలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.