ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 సంస్థలను వెంటనే విభజించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. విచారించిన సుప్రీం కేంద్రం, తెలంగాణలకు నోటీసులు జారీ చేసింది. 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థలు తెలంగాణాలో ఉన్నాయని ఏపీ పిటీషన్లో పేర్కొంది. ఈ సంస్థల విలువ రూ.1,42,601 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంస్థల విభజన ఆలస్యం అవుతుండటంతో ఏపీ తీవ్రంగా నష్టపోతోందని పేర్కొంది. తక్షణమే విభజన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరింది.