బీసీసీఐ బంగారు బాతు టాటా ఐపీఎల్లో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. ఇంత వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకపోయినా కానీ చెలరేగిపోతున్నారు. వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకుంటున్నారు. వీరిలో హైదరాబాద్ స్ట్రైక్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, బ్యాటర్ అభిషేక్ శర్మ, లక్నో ఆటగాళ్లు మొహ్‌సిన్ ఖాన్, ఆయుష్ బదోని, ముంబై ఆటగాడు తిలక్ వర్మ, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేష్ చౌదరి, గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ మొదటి వరుసలో ఉన్నారు.