కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి గుర్తు తెలియని వ్యక్తులకు బెదిరింపు కాల్స్ చేశారు. మహారాష్ట్రలోని కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు బెదిరించారు. 10 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఫోన్ చేశారని తెలుస్తోంది. ఉదయం 11.30, 11.40 గంటలకు దుండగుల నుంచి ఫోన్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆకతాయి పని ఉంటుందా? లేదా ఎవరైనా నిజంగానే చేశారా అనేే కోణంలో విచారిస్తున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు జరుగుతుంది.