జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగాల్ హౌరా పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ, రాజేష్ కచ్చప్, నమన్ బిక్సల్ ఉన్నారు. వారి దగ్గర పెద్ద మొత్తంలో నగదుతోపాటు కౌంటింగ్ యంత్రాలు ఉన్నట్లు గుర్తించారు. భారీ మొత్తంలో ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి ఎస్పీ స్వాతి భంగాలియా పేర్కొన్నారు. ఆ నగదు ఎక్కడిది, ఎంత ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది.