తెలంగాణలో 3 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సీఎం కేసీఆర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. విద్యా, సంక్షేమం, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా రావుల శ్రీధర్ రెడ్డి, రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్, మైనారిటీ ఆర్థిక సంస్థ చైర్మన్‌గా మహ్మద్ ఇంతియాజ్ నియమితులయ్యారు. రెండేళ్ల పాటు వీరు ఈ పదవుల్లో కొనసాగనున్నారు. కాగా, ఈ సందర్భంగా వారు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.