రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉన్నత విద్య, వ్యాపారం కోసం ఉక్రెయిన్ వెళ్లిన భారత విద్యార్థులు, ప్రజలు అక్కడే చిక్కుకున్నారు. దీంతో వారిని తరలించేందుకు ప్రభుత్వం ఆపరేషన్ గంగ చేపట్టి, వారిని స్వదేశానికి తరలిస్తోంది. ఇప్పటికే వేల మందిని తరలించగా.. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో 200మందిని తీసుకొచ్చారు. అయితే యుద్ధం ముదురుతున్న కొద్దీ, తరలింపు వేగవంతం చేయాలని డిమాండ్లు వస్తుండడంతో.. నేడు మరో మూడు IAF C-17 విమానాల ద్వారా భారతీయులను రప్పించనున్నారు. ఈ విమానాలు అధిక మొత్తంలో మందిని తరలించడానికి ఉపయోగపడతాయి. కరోనా సమయంలో ఆక్సిజన్ కంటైనర్లు తరలించడానికి వీటిని వినియోగించారు.