ఏపీలోని నెల్లూరు జిల్లాలో ముగ్గురు పదో తరగతి విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ విషయం జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లాలోని రాపూరు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదివే అంకిత, నాగమణి, మల్లిక జ్యోతిలు అదృశ్యమయ్యారు. దీనిపై గురుకుల విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా రాపూరు, పొదలకూరు, కలువాయికి చెందినవారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరు ఎందుకు అదృశ్యమయ్యారో ఎవరికీ అంతబట్టడం లేదు.