ఈ వీడియలో ముగ్గురు పిల్లలు రైలు పట్టాలపై ఆడుకుంటున్నారు. ట్రైన్ వారి దగ్గరికీ సమీపించే సమయానికి ఇద్దరు పిల్లలు పక్కకు తప్పించుకున్నారు. మరో బాలుడు ఇక దాదాపు తప్పించుకోలేడు అనుకున్న సమయానికి కనురెప్ప మాటులో పక్కకు తప్పుకున్నాడు. ఈ భయంకరమైన సంఘటన టొరంటోలో జరిగింది. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్తూ ఈ వీడియో సోషల్‌మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.