కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో పులివేట కొనసాగుతోంది. ఒమ్మంగి పంటపొలాల్లో మరో ఆవును చంపడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒమ్మంగి చుట్టూ ఉన్న శరభవరం, పోతులూరు, ధర్మవరం, రాచ పల్లి, ఉత్తరకంచి, పొదురు పాక, పాండవులపాలెం, భౌరు వాక, గజ్జెనపూడి వాసులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఎక్కడికక్కడ బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ పెద్దపులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇప్పటిదాకా మనుషులపై పులి దాడి చేయనప్పడికీ జనావాసాలకు సమీపంలో ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.