ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి ప్రజలు, అధికారులను ఆటలాడిస్తుంది. 20 రోజులు దాటినా కూడా చిక్కడం లేదు. తాజాగా పెద్ద శంకర్లపూడి ప్రాంతంలో గురువారం రాత్రి కనిపించినట్లు చెబుతున్నారు. అక్కడి RMP వైద్యుడు తన ఇంటి వైపు వెళ్తున్న క్రమంలో శునకాలు పెద్దగా అరవడంతో పులి వెనుదిరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఈ పులిని బంధించేందుకు సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేసినప్పటికి పులి మాత్రం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.