సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో.. చెప్పలేం. కొన్ని నవ్వు తెప్పించే వీడియోలైతే, మరికొన్ని విస్తుగొలిపే వీడియోలు ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఈ వీడియో. నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే, తన మానాన తాను ఓ కుక్క పడుకొని ఉండగా.. ఎటు నుంచి వచ్చిందో గానీ, ఓ చిరుతపులి లటుక్కున కుక్క వద్దకు వచ్చి గాండ్రించింది. వెంటనే తేరుకున్న కుక్క.. పులికి ఎదురుతిరిగి గట్టిగా మొరవడం స్టార్ట్ చేసింది. ఎంతకీ ఆపకపోవడంతో ఇంకేం చేసేది లేక ఆ పులి వచ్చిన దారినే వెళ్లింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.