న్యూఇయర్ సందర్భంగా డీజే టిల్లు మూవీ సీక్వేల్ గురించి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. టిల్లు స్క్వేర్ సీక్వేల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ అదిరిపోయే లుక్‌లో కనిపించాడు. వెల్కమ్ టూ టిల్లు ఇవెంట్స్ సినిమా గురించి చెప్పారు. మొదటి భాగం కంటే సెకెండ్ పార్ట్‌లో ఎంటర్టైన్మెంట్ డబుల్ ఉంటుందని మూవీ మేకర్స్ పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చారు.ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.