న్యూజిలాండ్ స్టార్ బౌలర్ టిమ్ సౌథీ ఓ ఇంటివాడయ్యాడు. తాజాగా ప్రేయసి బ్రయా ఫహీని పెళ్ళాడాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలను టిమ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ సందర్భంగా సౌథీకి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ఎన్నో ఏళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరికీ ఇప్పటికే ఇద్దరు పిల్లలు జన్మించడం విశేషం. టిమ్ సౌథీ ఐపీఎల్ లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.