ఏపీలోని తిరుపతి రైల్వే స్టేషన్ రూపం మార్చనున్నట్లు ఇటీవల రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ మోడల్ ప్రతిపాదించారు. ప్రపంచ స్థాయిలో నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయితే ఆ డిజైన్ బాలేదని అక్కడి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఖరారు చేసే డిజైన్ హిందూవుల సంస్కృతి గుర్తు చేసేలా ఉండాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. మరోవైపు ఈ మోడల్ బాలేదని ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ట్వీట్ చేయడం విశేషం.