ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ప్రాజెక్టుకు రైల్వే మంత్రిత్వ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ‘తిరుపతి రైల్వే స్టేషన్‌ను మేజర్ అప్‌గ్రేడేషన్’ పేరుతో రూ. 299 కోట్ల విలువైన రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ నగరం ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించే విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్‌ను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీ కెమెరా, కోచ్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటుచేయనున్నారు.