బంగ్లా ఇంటికి.. సూపర్ 4కు శ్రీలంక

© ANI Photo

ఆసియా కప్ లో శ్రీలంక సూపర్ 4కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్ పై గెలుపొందింది. మ్యాచ్ చివరి ఓవర్ దాకా వచ్చింది. ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు రాబట్టాల్సి ఉండగా.. లంక బ్యాటర్లు పని పూర్తిచేశారు. దీంతో గ్రూప్ బీ నుంచి అర్హత సాధించిన రెండో జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇదే గ్రూప్ నుంచి ఆప్గానిస్థాన్ తొలుత సూపర్ 4కు అర్హత సాధించింది. అటు గ్రూప్ ఎ నుంచి భారత్ సూపర్ 4కు దూసుకెళ్లింది. ఇక గ్రూప్ లెవెల్ లో చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ తో హాంకాంగ్ తలపడనుంది.

Exit mobile version