వేసవిలో చెమట తీవ్రంగా పుడుతుంది. ముఖ్యంగా చేతి చంకల్లో(అండర్ ఆర్మ్స్) ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతో చంక భాగంలోని చర్మం నల్లగా మారుతుంది. ఇలా నల్లటి చారలను తొలగించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది. బేకింగ్ సోడా, నీరు కలిపిన పేస్టును చంకల్లో రుద్దుకోవాలి. నిమ్మరసం, బంగాళదుంపలకు బ్లీచింగ్ గుణం ఉండటం వల్ల వీటితో మర్దన చేసుకోవచ్చు. అర నిమ్మకాయ తీసుకుని శనగపిండితో రుద్దుకోవాలి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం, శనగపిండి కలగలిపిన పేస్టుతో కూడా నల్ల చారలను పోగొట్టుకోవచ్చు.