గడిచిన 24 గంటల్లో ఇండియాలో 18,819 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిన్న తక్కువ కేసులు వచ్చాయి.. కదా అని ఊపిరి పీల్చుకునే లోపే నేడు భారీగా కేసులు పెరిగాయి. నిన్నటితో పోల్చుకుంటే 29.7 శాతం కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. 39 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.