స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో అతడు ఈ నెల 16న భారత ఆటగాళ్లతో ఇంగ్లండ్ టూర్ కు వెళ్లలేకపోయాడు. కానీ ప్రస్తుతం అశ్విన్ కరోనా నుంచి కోలుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో నేడు అతడు ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతాడని.. బీసీసీఐ అధికారి ఒకరు ప్రకటించారు. అశ్విన్ కు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిందని, దీంతో అతడిని ఇంగ్లండ్ కు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.