అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో నేడు భారత్ బంద్ చేపట్టేందుకు కొన్ని నిరసన బృందాలు ముందుకొచ్చాయి. కేంద్రం ఎంత కంట్రోల్ చేస్తున్నా కానీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్ చేపట్టనున్నారు. హర్యానా, పంజాబ్, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించే వారిని వదిలిపెట్టబోమని పోలీసులు హెచ్చరించారు. జార్ఖండ్ లో నేడు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.