గడిచిన వారం రోజుల నుంచి రోజురోజుకూ పెరుగుతూ పోతున్న కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 6,594 కరోనా కేసులు వచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 18 శాతం మేర తగ్గాయి. అటు 4,035 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలు దాటింది. ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.