నేడు రాహుల్ గాంధీ నాలుగో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. మరో పక్క దేశం మొత్తం అగ్నిపథ్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఈడీ విచారణల పేరుతో రాహుల్‌ను వేధించడం, అగ్నిపథ్ అంశాలపై వారు రాష్ట్రపతితో చర్చించనున్నారు.