ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదలకానున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభంకానుంది. భాజపా, కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలకు అనుకూలంగా ఎగ్జిట్ ఫలితాలు రాగా.. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారనేది ఆసక్తికరంగా మారింది. యూపీలో భాజపా, ఎస్పీల మధ్య రసవత్తర ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.