నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

© ANI Photo(file)

తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ మొదలు కానుంది. కోటి బతుకమ్మ చీరలను రాష్ట్ర ప్రభుత్వం ఆడపడచులకు అందించనుంది. ఈ యేడాది 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల అంచులతో చీరలు నేతన్నలతో నేయించింది. 92 లక్షల రెగ్యులర్ చీరలకు అదనంగా వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్లు పొడవు గల 8 లక్షల చీరలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏటా అందిస్తున్నట్లుగానే ఈ సారి కూడా చీరల పంపిణీ చేయనుంది.

Exit mobile version