బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నేడు నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆసీస్‌ను భారత్ ఢీకొట్టబోతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గడం భారత్‌కు ఎంతో కీలకం. బ్యాటర్ల ఫామ్ లేమి టీమ్ఇండియాకు సమస్యగా మారింది. ఈ మ్యాచ్‌లో రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సత్తామేరకు రాణించాల్సి ఉంది. అశ్విన్, జడేజాలు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.